Header Banner

బ్యాంక్‌లో బంగారం పెట్టి లోన్ తీసుకున్నారా? మీకో షాకింగ్ న్యూస్!

  Sun Feb 23, 2025 11:28        Business

గ్రామాల్లో చాలా మంది బంగారంపై లోన్లు తీసుకుంటూ ఉంటారు. గ్రామీణ బ్యాంకుల్లో రైతులు అత్యధికంగా బంగారంపై రుణాలు పొందుతూ ఉంటారు. ఇక పట్టణ ప్రాంతాల్లోనూ చాలా మంది బంగారం తనఖా పెట్టి రుణాలు పొందుతూ ఉంటారు. ఎందుకంటే గోల్డ్ లోన్స్ అనేవి చాలా సులభంగా పొందొచ్చు. వేగంగా వస్తాయి. 

 

డబ్బులు అత్యవసరం అయినప్పుడు ఇంట్లోని బంగారం బ్యాంక్‌లో పెట్టి రుణాలు పొందుతూ ఉంటారు.అయితే ఇలా రుణాలు పొందిన వారు, లేదంటే పొందే వారు కచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాల్సిందే. లేదంటే ఇబ్బంది పడాల్సి రావచ్చు. ఎలా అని అనుకుంటున్నారా.. చిత్తూరులో జరిగిన ఈ ఘటనను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. బ్యాంక్‌లోని బంగారాన్ని మాయం చేశారు. ఏకంగా రూ.2 కోట్లకు పైగా మోసం జరిగినట్లు తెలుస్తోంది. 

 

ఇది కూడా చదవండి: అరబ్ అడ్వొకేట్ తో చర్చించిన అనిల్ ఈరవత్రి! 17 మంది భారతీయులను ఉరిశిక్ష! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

నాగలాపురం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ సూర్య తేజ ఈ పనికి పాల్పడ్డాడు. బంగారం మాయం చేశాడు. ఎలా అంటే.. బ్యాంక్‌లో గోల్డ్ లోన్స్ పెట్టిన బంగారాన్ని తీసుకొని వేరే పేర్లపై అదే బ్యాంక్‌లో మళ్లీ కొత్తగా గోల్డ్ లోన్ తీసుకున్నారు. ఆ డబ్బులను ఈ అసిస్టెంట్ మేనేజర్ తీసుకున్నాడు. 

 

అంతేకాకుండా మరింత బంగారాన్ని తీసుకువెళ్లి బయట ప్రైవేట్ బ్యాంకుల్లో కూడా పెట్టి గోల్డ్ లోన్స్ తీసుకున్నాడు. ఇలా మొత్తంగా రూ.2.35 కోట్ల వరకు మోసం చేసినట్లు తెలుస్తోంది. దాదాపు 5.5 కేజీల బంగారాన్ని ఇలా మోసం చేశాడు. ఈ క్రమంలో అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈయనతో పాటు బ్యాంక్ మేనేజర్ శేఖర్‌పై కూడా కేసు నమోదు చేశారు. ఎందుకంటే లాకర్ రూమ్ తాళాలు చేరొకరి వద్ద ఉంటాయి. అందుకే మేనేజర్‌పై కూడా కేసు నమోదు అయ్యింది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. యుద్ధం ముగియాలంటే అదొక్కటే మార్గం!

 

ప్రజలకు అప్డేట్.. ఆధార్ కార్డులో కొత్త మార్పు! ఇది తెలుసుకోకపోతే నీ పరిస్థితి ఇక అంతే!

 

ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త హైవేకు లైన్ క్లియర్! ఈ జిల్లాలకు మహర్దశ!

 

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Business #Loans #GoldLoans